నా బ్లాగుని శోధించండి


Home హస్యాంజలి Free Software links My Orkut My FaceBook కూడలి
రాంగోపాల్ బ్లాగుకి స్వాగతం...

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

మహాశివరాత్రి శుభాకాంక్షలు

1, డిసెంబర్ 2009, మంగళవారం

ఎయిడ్స్ కి చెబుదాం టాటా


ఎయిడ్స్ మన దేశాన్ని పీడిస్తున్న సమస్యల్లో యిది ఒకటి .20 సం. క్రితం ఎయిడ్స్ అంటే ఎరగని భారతదేశంలో ఇప్పుడు(మే 2005 నాటి లెక్కల ప్రకారం )1,09,349 మంది ఎయిడ్స్ మహమ్మారితో బాధపడుతున్నారు. అందులో 37% మంది 30 ఏళ్ళ లోపువారే, 31,982 మంది ఆడవారు. ఇవికాక నమోదు కాని కేసులెన్నో ఉన్నాయి. ఎయిడ్స్ బాధితుల్లో ఎక్కువ శాతం మంది ఆఫ్రిక ఖండంవారే. తరవాతి స్థానంలో మన భారతదేశం ఉంది. మన దేశంలో ఎయిడ్స్ బారిన పాడుతున్నవారి సంఖ్యా ఆంధ్రప్రదేశ్లో చాల త్వరగా వ్యాపిస్తుందని NACO చెబుతుంది. మన దేశంలో 10% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆధ్రప్రదేశ్లోనే ఉన్నారు.

పెద్దవాళ్ళు క్షనికావెశమ్లొ చేసిన తప్పుకి (ముఖ్యంగా మగవాళ్ళు ) అభం శుభం ఎరగని పసిప్రాణాలు భాదపడుతున్నాయి . మధ్య వయస్సులోనే తల్లిదండ్రులు మరణిస్తున్నారు. పుట్టుకతోనే చిన్నారులు ఎయిడ్స్ బారినపడటమేగాక, తల్లిదండ్రులులేని అనాధలౌతున్నారు .

ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా వున్నా దేశం చైనా , అభివ్రుద్దికాటంకం జనాభా ఎక్కువగా వుండటమని అన్ని దేశాలు నమ్ముతాయి . కాని, ఆ మాటని అనగత్రోక్కి అభివృద్ది విప్లవాన్ని శ్రుష్టిస్తుంది చైనా. చైనా అభివ్ర్ధధిని అంచనావేయడానికి చక్కని వుదాహరణ భీజింగ్ ఒలంపిక్స్. నిన్నటిదాక జనాబాలో ప్రధమస్థానంలో వున్నా చైనా రేపు ఆర్థికాభివ్రుధ్ధిలొ ప్రధమస్థానంలో వుంటుందనడంలో ఆచర్యపోనక్కరలేదు.

మన ప్రక్క దేశం చైనా అభివృద్ది విప్లవం జరుపుతుంటే, మన దేశం మాత్రం ఎయిడ్స్ విప్లవం జరుపుతుంది. విప్లవమనే ఉన్నతమైన మాటని ఎయిడ్స్ కి అనువదించటం తప్పేకావచ్చు కాని, అతి తక్కువ కాలంలో అతిపెద్ద మార్పుజరుగుతున్నదని చెప్పడానికి ఇంతకన్నా మంచి మాట లేదనేచేప్పాలి.మన దేశంలో ఎక్కువమంది ఎయిడ్స్ బారిన పడడానికి కారణం నిరక్షరాస్యత, అవగాహనరాహిత్యం మరియు భిధరికం.

ముంబాయ్ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో కొన్ని వీధులు పూర్తిగా సెక్స్ వర్కర్సుతో నిండిపోతున్నాయి. యువతులు ఈ ఉభిలోకిదిగడానికి ముఖ్యమైన కారణం భీధరికం. దారిద్రం అనుభవించే కుటుంబాలకి డబ్బు ఎరగా చూపి కొందరు దౌర్భాగ్యులు అభం శభం తెలియని అమ్మాయిల్ని కనీస వయస్సుకూడలేని చిన్నారుల్ని సెక్స్ వర్కర్సుగా మారుస్తున్నారు. కటిక దారిద్రంవల్ల కన్న తల్లిదండ్రులే స్వంత బిడ్డలను అమ్ముకునే పరిస్థితికి దిగజారుతున్నారు. ఈలాంటి దృశ్యాలు ఎక్కువగా గిరిజన తాండాల్లో చూస్తున్నాము.

సెక్స్ వర్కర్స్ ధగ్గరికోచ్చే విటుల్లో ఎక్కువమంది లారిడ్రైవర్లే. కుటుంబాలకి ఎక్కువకాలం దూరంగా ఉండటంవల్ల వీరు ఎక్కువగా రెడ్లైట్ ఎరియాలకి ఆకర్షితులౌతున్నారు. వారు చేసే తప్పుకి వారితో పాటు వారికుటుంబాలు కూడా నాశనమైపోతున్నాయి.

సరే ఇవన్ని మనకు తెలిసినవిషయలే. కాని, తెలిసినా మనమేమి చేస్తున్నాము? ఎయిడ్స్ బారిన పడిన వారిని మానసికంగా హింసించడంతప్ప. ఇది మనసున్నవాళ్ళు చేయాలిసిన పనికాదు. మనమొక్కరమే బాగుంటే చాలు అనుకోకుండా మనప్రక్కవాళ్ళు కూడా బాగుండాలని అనుకోవాలి. ఎవరో చేస్తున్న తప్పులకి మనమేమిచేయగలం అని అనుకుంటే ఏమి చేయలేము కాని,మనిషితలచుకుంటే అసాధ్యమైంది ఏది లేదు.

ఎయిడ్స్ అంటే నయంకాని జబ్బని చాలామందికి తెలుసు. కాని, ఎ ఎ కారణాలవల్ల ఎయిడ్స్ వస్తుందనేది కొద్ది మందికే తెలుసు. ఇక్కడే మన బాధ్యత మొదలౌతుంది. ఎయిడ్స్ రావడనికిగల కారణాలు, ఎయిడ్స్ రాకుండా నివారనమార్గలేంటి, ఒకవేళ పొరపాటున ఎయిడ్స్ బారిన పడినవారికి ఎలా చేయుతనివ్వాలి అనే విషయాలను
ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగితే ఎయిడ్స్ బారిన పడే వారి సంఖ్య తగ్గుతుంది అంతే కాకా ఎయిడ్స్ బారిన పడిన వారు
నిరాదరణకి గురికారు.

మనం ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు, తప్పుడు పనులు చేసినవారే ఎయిడ్స్ బారిన పాడుతారు, ఎయిడ్స్ వల్ల జనాభా తగ్గుతుంది అని వెర్రిగా ఆలోచించేవారు ఒకటాలోచించాలి ఎయిడ్స్ కేవలం లైంగిక చర్యలవల్ల మాత్రమే వ్యాపించదు కలుషిత రక్తమార్పిడి, పరిశుభ్రంగాలేని సిరంజిలు మరియు బ్లేడ్లతో కూడా వస్తుంది. మనంకాని మన బందువులుకాని తప్పుడు పనులు చేయకున్నా,షేవింగ్ చేయించుకున్నపుడో,ఇంజక్షన్ చేయించుకున్నప్పుడో లేక పచ్చబొట్టు (టాటు) పోడిపించుకున్నపుడో పొరపాటున ఎయిడ్స్ బారిన పడవచ్చు . అప్పుడు ఎయిడ్స్ వల్ల తగ్గే జనాభాలో మనమొ మన బందువులో ఉండచ్చుగా అందుకే వెర్రిగా కాకుండా సేవాభావంతో ఆలోచించుదాం.

జనంలో మనమొక్కరమేకాదు జనంలో మనమొకరిమి మాత్రమే కదా. కనుక సాటివారికి సహాయ పడుదామనే ధృక్పదంతో ముందుకు సాగుతాం. ఎయిడ్స్ పై అందరికి అవగాహనా కలిగించి, ఎయిడ్స్ ని నివారించడంలో మనమూ ఒక సైనికుడౌధాం. ఎయిడ్స్ రహిత సమాజానికి దారి చూపిస్తామని మన మనసాక్షిపై ప్రమాణం చేదాం. సరేనా నా.. మంచి మిత్రులారా.

"ఇది వేదాంతం కాదు వాస్తవం "

ఎయిడ్స్ బారిన పడినవారికి ఈ వ్యాసాని అంకితమిస్తున్నాను

మీ.... రాంగోపాల్
నా బ్లాగ్ పై మీ అభిప్రాయాలు నాతో పంచుకోడానికి కామెంట్ బాక్స్ లో వ్రాయండి.