పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని వేమన మహాకవి చెప్పిన మాటకు అర్ధం తెలియక పోయినా, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించం ఎందుకంటే మన
చదువులంత ఇంగ్లిష్మయంకధ " తన కోసం బ్రతికేవాడు మాములు మనిషి ఇతరులకోసం బ్రతికేవాడు మహానుబావుడు" అన్నాడో మహానుబావుడు.
ఈ బిజీ లైఫ్ లో డబ్బు ఫై వున్న శ్రద్ద మరొక దాని ఫై లేదు, కాదంటారా? చివరికి తన గురించి తాను ఆలోచించడానికే
టైం మిగల్చడంలేదు. దీనికికారణం అవసరానికి మించి డబ్బు సంపాదించాలనే ఆలోచన . ఒక్కసారి కుడా అవసరానికి మించిన
డబ్బెండుకని, ఎవరు ఆలోచించడం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో కదలినపుడు స్వర్ధమనే ముసుగుతో దాచిపెడుతున్నాము. ఎంతసేపు నేనుకాకుంటే నా కొడుకులు అనుబవిస్తారనే ఆలోచనే తప్ప, అసలా కొడుకులు సోమరిపోతులు కావడానికి వారు సంపాదించే మితిమీరిన డబ్బే అని ఎవరాలోచించడం లేదు .
ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి ఎందుకీ అసమానతలు, అందరం పుట్టింది అమ్మకడుపునుంచేగా కాని, కొందరికి తినడానికి తిండి దొరకడం లేదు మరికొందరికి తిన్న తిండి అరగాడంలేదు. మనిషిలో మానవత్వం కరువౌతుంది మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది.
ఎక్కడో యు
గోస్లోవి
యలో పుట్టిన
మథర్ తెరీసా తన జీవితాన్ని మన దేశంలోని బీద ప్రజలకోసం దారపోసింది . కాని, మనం ఈ నేలపై పుట్టి కూడా కలలోకూడా 'సేవ' అనే మాటను స్మరించలేకపోతున్నాము. ఎన్ని కోట్లు సంపాదించినా మనము బ్రతికేది సగటు జీవితమే(60) కాని , పుర్నష్కులంకాలేముగా ఒక బిక్క్ష్హమెత్తుకునే వృద్ధురాలు వంద సంవ్చరాలు బ్రతకవచ్చు కోట్లు గడించి ముపై సంవ్చ్చారాలకే రాలిపోవచ్చు. మనం కొటిశ్వరులమైతే తాత్కాలికమైన కీర్తినిస్తుంది కాని మనం ఇతరులకు చేసే సహాయం మన జీవితన్తమేకాక మన
జీవితనంతరముకూడా పూర్ణ యసస్సునిస్తుంది.
నా బ్లాగులో ఈ శిర్షిక చదివిన వారిని నేనోకటే కోరుతున్నాను మనము తినకుండా ఇతరులకు పెట్టకున్నా, కనీసం మనం తిన్న తరువాతైనా ఇతరులకు పంచిపెట్టుదాం . అప్పుడే కొంతవరకైనా ఈ ఆర్ధిక అసమానతలు కనుమరుగౌతాయి
చంద్రునికో నూలుపోగులా నా ఈ చిన్ని ప్రయత్నం ఈ శిర్షిక చదివినవారిలో చిన్ని మార్పును తెచ్చినా , నా ప్రయత్నం
సఫలిక్రుతం అయినట్టేనని బావిస్తాను. తొలిసారిగా నేను చేసిన చిన్న ప్రయత్నంలో చిన్ని చిన్ని తప్పిదాలను పెద్దమనసుతో క్షమిన్చి అందులోని భావాన్ని మాత్రమే గ్రహించగలరు .
ఈ శీర్షికను విశ్వమాత మథర్ తెరీసాకు అంకితమిస్తున్నాను .
మీ.... రాంగోపాల్