నా బ్లాగుని శోధించండి


Home హస్యాంజలి Free Software links My Orkut My FaceBook కూడలి
రాంగోపాల్ బ్లాగుకి స్వాగతం...

30, సెప్టెంబర్ 2009, బుధవారం

ర్యాగింగ్ రాక్షసి



ఒకప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్లో భయాన్ని భిడియాన్ని పోగొట్టటానికి సీనియర్స్ జునియర్సని సరదా సరదా మాటలతో వారికిచేరువై స్నేహితులుగామారడానికి పుట్టిన ర్యాగింగ్, రానురాను రాక్షస చేష్టలుగ మారింది.
ఒక మనిషిని హింసించి ఇంకొకమనిషి ఆనందం పొంధటాన్ని మానసిక వైద్యుల భాషలో చెప్పాలంటే "శాడిజం" అంటారు. కాని మన కాలేజీలలో దానికి వేరే పేరుంది అదే ర్యాగింగ్.
శత్రుదేశ సైనికులు యుద్ధ ఖైదీలుగా దొరికినపుడు(పూర్వపు రాజుల కాలంలో ఇప్పుడు కొన్ని దేశాలలో ) వారిని భానిసలుగా మార్చి హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతారు. ఆ దృశ్యాలు ఎప్పుడైనా మనం టేవిలో చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి. అంత సున్నితమైన మనసున్న మనుషులున్న మన భారతదేశంలో కొన్ని కాలేజీలలో ర్యాగింగుతో ఒక మనిషి ప్రాణాలు తిసుకోనేలా హింసించే స్టూడెంట్స్ ఉన్నారంటే మనం ఎంత సిగ్గుపడాలి.
చదువుల్లోను, వయసులోనూ పెద్దవారైన లేక్టురర్స్కి నమస్కరించడానికి మొహమాటపడే విధ్యార్థులు ఒక్క సంవత్సరం ముందు కాలేజిలి అడుగు పెట్టినంత మాత్రాన సీనియర్స్ వారి తర్వాత వచ్చే జునియర్సుని సెల్యూట్ చేయమని క్యన్టేంకి
పోవద్దని ముర్కంగా తల తోక లేని విషయాలతో తోటి స్టూడెంట్స్ని హింసించడం ఎంత ముర్కంగా ఉంటుందో ఆలోచించండి!
బట్టతల, షుగర్ ఇంకా జన్యు సంబంధమైన జబ్భులు వంశపారంపర్యంగా వస్తాయి. అలాగే ర్యాగింగ్ కాలేజీలలో సీనియర్స్ నుండి జునియర్సుకి పాకుతుంది.
సీనియర్స్ చేసే ర్యాగింగ్ జునియర్స్లో తట్టుకున్న వారు సీనియర్ స్టూడెంట్స్ అయిన తర్వాత వారి తర్వాత వచ్చే జూనియర్స్ పైన రివేంజు తిర్చుకున్తునారు. ర్యాగింగ్ తట్టులేని సున్నిత మనస్కులు కాలేజి మానుకోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు. ర్యాగింగ్ భారిన పడేవాళ్ళు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మరియు భీద, మధ్యతరగతి కుటుంబాల్లోని యువతి, యువకులు ఎక్కువగా ఉన్నారు.
ర్యాగింగ్ చేసే వారిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారంటే, మనదేశం చదువులో ముందుకేల్ల్తు సంస్కారంలో వెనక్కి వెళ్తుందని అనుకోవాలి. చదువుతో పాటు సంస్కారం నేర్పే లెక్చరర్స్ చూసి చూడనట్టుగా ఉంటున్నారు. ర్యాగింగ్ జరిగి ఆత్మహత్యల వరకు వెళ్ళిన తర్వాత కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించే బదులు అసలు ర్యాగింగ్నే నివారిస్తే కాలేజి యాజమాన్యాల సోమ్మేమిపోతుందో అర్ధంకాదు.
ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వం ర్యగింగ్పై కటిన చర్యలు తీసుకొంటుంది. అందుకు మన ప్రభుత్వాని ఎంతగానో ప్రసంసించాలి. ర్యాగింగ్ రాక్షసి ప్రభుత్వం విధించే శిక్షలో ఇంకా ఎవరో ఏమో చేస్తే పూర్తిగా అంతరిస్తుంతన్కోవడం మన భ్రమే ర్యాగింగ్ పూర్తిగా అంతరించాలంటే ప్రతి ఒక స్టూడెంట్ ర్యాగింగ్ అంటే పైశాచిక ఆనందమని గుర్తించాలి. తోటి స్టూడెంట్స్ జూనియర్స్ అయినా, సీనియర్స్ అయినా విద్యనుs ఆర్జించడానికేవచ్చామని గుర్తించి స్నేహభావంతో కలిసుండి మనదేశ ఖ్యాతిని పెంచాలని ప్రతి ఒక్క స్టూడెంట్ ని కోరుతున్నాను.

17, సెప్టెంబర్ 2009, గురువారం

అమ్మ

సృష్టిలో తియ్యని పదం అమ్మ. తల్లి స్పర్శ తెలియని మనిషి ఉండడు. ఆ మాటకు వస్తే తల్లి స్పర్శ తెలియని జివి ఈ సృష్టిలోనే లేదు . పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ అని ఓ కవి రాసిన పాటలో ఎంత మాధుర్యం ఉంది. అమ్మ అని తెలుగులో పిలిచినా మమ్మీ అని ఆంగ్లంలో పిలిచినా మాత అని హిందిలో పిలిచినా ఏ భాషలో పల్కిన ఆ మాట వెనుక ఉన్నా ఒకే ఒక అర్ధం అమ్మలోని కమ్మదనం.
చిన్నప్పుడు మా భామ్మ చెప్పేది డిల్లికి రాజైన తల్లికి కొడుకేనని దాని అర్ధం ఏంటే భామ్మఅని నేనడిగితే తననేది కొడుకు ఎంత పెద్ద వాడైన కన్న తల్లికి కొడుకుపై ఉన్నా ప్రే తగ్గదని, ఆ విషయం నిజమని ప్రతి ఒక్కరికి స్వానుబవమే.

కానీ నాకు ఒకే సందేహం మన రూపం తెలియని నాటి నుండి మనం ప్రపంచంలో ఒకరిగా గుర్తించేవరకు తన ప్రేమతో పెంచిన తల్లికి మనమేమిస్తున్నామని, నిజంగా ఆలోచించండి ఎంతమంది పెద్దయ్యాక కన్న తల్లిదండ్రుల్ని ఆదరిస్తున్నారు. తల్లికి మనపై ఉన్నా ప్రేమ మనకు ఆమెపై ఉండిఉంటే ఈ వృద్ధాశ్రమాలు (Old age homes) ఉండి ఉండవా.
బార్య పెళ్ళికి ముందు చదువుందా రూపం బాగుందా తనను పోషించగలాడ ఇంకా సవాలక్ష్య ఆలోచించి పెళ్లి చేసుకుంటుంది బర్త కూడా తనకిష్టమైన వారినే బార్యగా ఎంచుకుంటాడు కాని తల్లి అలాకాదు అసలు తన బిడ్డ రూపం ఆడ,మగ అని కూడా తెలియదు ఐన తొమ్మిది నెలలు సంతోషంగా తన గర్భంలో మోసి పుట్టిన భిడ్డ ఆడైనా, మగైనా కాలు, చేయి వంకరున్న ప్రేమతో తన స్తన్యమిచ్చి పెంచి పెద్దవాళ్ళని చేస్తుంది. అలాంటి అమ్మకు మనమిచ్చదేంటి పుట్టకముంద అమ్మ కడుపులో తన్ని పుట్టాకా అమ్మ పాలు తాగి అల్లరి చేసి చివరికి అమ్మకు గుప్పెడు మెతుకులు పెట్టలేక వృద్ధాశ్రమానికి పంపుతున్నాం ఇధన అమ్మకు మనమిచ్చే బహుమతి చచ్చాక తల కొరివితో తల్లి ఋణం తీరిందని తలనీలాలిస్తే సరిపోతుందా, బతికున్న తల్లికి ప్రేమతో పిడికెడు మెతుకులు పెడితే ఆ తల్లి హృదయం ఎంత సంతోషపడుతుంది.
పాత విషయమే ఐన మనమందరం గుర్తుంచుకోవలసిన విషయం ఇవ్వాటి కూతుళ్ళు, కోడల్లే రేపటి తల్లులు అలాగే ఇవ్వాటి కొడుకులే రేపటి తండ్రులని గుర్తుంచుకోవాలి. మనం మన తల్లిదండ్రులపై చూపిన చిత్కారాలు రేపో, మాపో మన పిల్లల నుండి ఎదురైతే అప్పుడు మన పరిస్థితి ఆలోచించండి. ఆలోచించడానికే బయమేస్తుంది కదు, మరెండుకాంది మనకి స్వార్ధం ఇద్దరు కలిస్తే పుడతము నలుగురుమొస్తే పోతాము మధ్యలో స్వార్ధాన్ని selfishness అని ఆంగ్లంలో అందంగా చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం ఇది ఎంత మూర్ఖంగా ఉంది.
ప్రేమను ప్రేమతో ప్రేమించి ప్రేమను పంచి మనమూ ప్రేమలోని నిజమైన ప్రేమని ఆస్వదిస్తమా.
"మే రోండవ ఆదివారం mother's day సందర్బంగా ప్రపంచంలోని తల్లులందరికి శిర్షిక అంకితమిస్తున్నాను"
సరే ఇక సెలవు .
మీ..
రాంగోపాల్



శిర్షిక మీకు నచ్చితే, మీ కామెంట్ని కామెంట్ బాక్స్ లో వ్రాయండి