చిన్నప్పుడు మా భామ్మ చెప్పేది డిల్లికి రాజైన తల్లికి కొడుకేనని దాని అర్ధం ఏంటే భామ్మఅని నేనడిగితే తననేది కొడుకు ఎంత పెద్ద వాడైన కన్న తల్లికి కొడుకుపై ఉన్నా ప్రే
కానీ నాకు ఒకే సందేహం మన రూపం తెలియని నాటి నుండి మనం ఈ ప్రపంచంలో ఒకరిగా గుర్తించేవరకు తన ప్రేమతో పెంచిన తల్లికి మనమేమిస్తున్నామని, నిజంగా ఆలోచించండి ఎంతమంది పెద్దయ్యాక కన్న తల్లిదండ్రుల్ని ఆదరిస్తున్నారు. తల్లికి మనపై ఉన్నా ప్రేమ మనకు ఆమెపై ఉండిఉంటే ఈ వృద్ధాశ్రమాలు (Old age homes) ఉండి ఉండవా.
బార్య పెళ్ళికి ముందు చదువుందా రూపం బాగుందా తనను పోషించగలాడ ఇంకా సవాలక్ష్య ఆలోచించి పెళ్లి చేసుకుంటుంది బర్త కూడా తనకిష్టమైన వారినే బార్యగా ఎంచుకుంటాడు కాని తల్లి అలాకాదు అసలు తన బిడ్డ రూపం ఆడ,మగ అని కూడా తెలియదు ఐన తొమ్మిది నెలలు సంతోషంగా తన గర్భంలో మోసి పుట్టిన భిడ్డ ఆడైనా, మగైనా కాలు, చేయి వంకరున్న ప్రేమతో తన స్తన్యమిచ్చి పెంచి పెద్దవాళ్ళని చేస్తుంది. అలాంటి అమ్మకు మనమిచ్చదేంటి పుట్టకముంద అమ్మ కడుపులో తన్ని పుట్టాకా అమ్మ పాలు తాగి అల్లరి చేసి చివరికి అమ్మకు గుప్పెడు మెతుకులు పెట్టలేక వృద్ధాశ్రమానికి పంపుతున్నాం ఇధన అమ్మకు మనమిచ్చే బహుమతి చచ్చాక తల కొరివితో తల్లి ఋణం తీరిందని తలనీలాలిస్తే సరిపోతుందా, బతికున్న తల్లికి ప్రేమతో పిడికెడు మెతుకులు పెడితే ఆ తల్లి హృదయం ఎంత సంతోషపడుతుంది.
పాత విషయమే ఐన మనమందరం గుర్తుంచుకోవలసిన విషయం ఇవ్వాటి కూతుళ్ళు, కోడల్లే రేపటి తల్లులు అలాగే ఇవ్వాటి కొడుకులే రేపటి తండ్రులని గుర్తుంచుకోవాలి. మనం మన తల్లిదండ్రులపై చూపిన చిత్కారాలు రేపో, మాపో మన పిల్లల నుండి ఎదురైతే అప్పుడు మన పరిస్థితి ఆలోచించండి. ఆలోచించడానికే బయమేస్తుంది కదు, మరెండుకాంది మనకి స్వార్ధం ఇద్దరు కలిస్తే పుడతము నలుగురుమొస్తే పోతాము మధ్యలో స్వార్ధాన్ని selfishness అని ఆంగ్లంలో అందంగా చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం ఇది ఎంత మూర్ఖంగా ఉంది.
ప్రేమను ప్రేమతో ప్రేమించి ప్రేమను పంచి మనమూ ఆ ప్రేమలోని నిజమైన ప్రేమని ఆస్వదిస్తమా.
"మే రోండవ ఆదివారం mother's day సందర్బంగా ప్రపంచంలోని తల్లులందరికి ఈ శిర్షిక అంకితమిస్తున్నాను"
సరే ఇక సెలవు .
మీ..
రాంగోపాల్
ఈ శిర్షిక మీకు నచ్చితే, మీ కామెంట్ని కామెంట్ బాక్స్ లో వ్రాయండి
Hai Ramgopal i like you and I support u 9Srinivas)
రిప్లయితొలగించండి