నా బ్లాగుని శోధించండి


Home హస్యాంజలి Free Software links My Orkut My FaceBook కూడలి
రాంగోపాల్ బ్లాగుకి స్వాగతం...

14, అక్టోబర్ 2009, బుధవారం

బాల కార్మికులు

స్వాతంత్ర్యం షష్టి పూర్తి చేసుకున్న మనం మాత్రం పసిపాపలను బాలకార్మికులుగా చూస్తున్నాము, మారుస్తున్నాము.బ్రిటిష్ వాళ్ల నుండి స్వేచ్చ పొందామే గాని, పసిపిల్లలకు స్వేచ్చ ఇవ్వలేకపోతున్నాము. 60వత్సరాల స్వేచ్చ వాయువులు పిలుచుకున్నభారతావనిలో స్వేచ్చ అంటే ఎరగని చిన్నారులను చూస్తున్నాం.
దేవుని గుడిలో దండం పెట్టి బయట కనిపించే చిన్నారులకి రూపాయో అర్ధరూపాయో చేతిలో పెట్టి "కిలో పాపం" కదిగెసుకున్తునామ్ అనుకుంటున్నమేగాని, ఆ పిల్లలు ఆకలి భాధ భరించలేక బాల కర్మికులుగాను, ఆకాస్త పని కూడా లేనప్పుడు చేయిచాచి అర్దించే చిట్టి చేతులను పొద్దున లేచినప్పడినుంచి, నిద్ర పోయేవరకు స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులు పుట్టిన ఈ గడ్డపైన చూస్తూ మౌనంగా ఉంటున్నాం.
కారణం, ఒకే ఒక్క ప్రశ్న నకెందుకులే?
ఔను! ఇదే ప్రశ్న స్వరాజ్యం కోసం పోరాడిన గాంధీ మహాత్మునికో, మన తెలుగువాడు అల్లూరి సీతారామరాజుకో, ఇంకా ఎందరో మహానుభావులకో వచ్చి ఉంటే ఇవాళ మన నేలపైనే మనమందరం భానిసలుగా ఉండేవాళ్ళం. భానిస సంకేల్లనుండి విముక్తి పొందిన మనం, బాల కార్మికులకు మాత్రం విముక్తి ప్రసాధించలేకపోతున్నాం. అల ఆలోచిస్తే దినిని నివారించడం మనకు పెద్ద సమస్యేమీ కాదు,నివారించాలని ఆలోచించకపోవడమే మనం చేస్తున్న ఆలస్యం.
మనలో కొందరు అనుకోవచ్చు నా ఒక్కడి వల్ల ఏమౌతుందని కానీ, ఒక్కొక్క చుక్క నీరు కలిస్తేనే సముద్రమౌతుందని మనందరికీ తెలిసిన విషయమే, విషయాన్నీ మరొక్కసారి గుర్తు చేసుకుంటే నా వల్ల ఎమౌతుందన్న ఆలోచన రాదు.
భారతమాత భిడ్డలారా నాతోబుట్టువులార మనమందరం కలిసి మన ప్రయత్నం ఈ రోజు నుండే ప్రారంభిద్దాం

ఇప్పుడు
బాల కార్మికులుగా మారడానికి గల కారణాలు ఆలోచిద్దాం.
1.అతి ముఖ్య కారణం పేదరికం:- రెక్కాడితే గాని డొక్కాడని భిద కుటుంభాలలో బార్యబర్తలు కష్టం వారి కుటుంబ కనీసఅవసరాలకు చాలక వారి పిల్లలను లేత వయసులోనే పాఠశాలకి బదులు పనికి పంపి బాల కార్మికులుగా కన్నాతల్లిధన్రులె మరుస్తునారు. విషయాన్నీ చూస్తే చెట్టు ఆకులను తెంపి చెట్టుకే ఎరువుగా వేసినట్టుంది కదా!
2. అనాథ పిల్లలు:- కామంతో కొవ్వెక్కిన ' ఒక మగ ఒక ఆడ' చేసిన తప్పుకి చెత్త కున్దిలనే తల్లిగా ఇల్లుగా మార్చుకున్న పిల్లలు బాల కార్మికులుగానో, ముష్టి పిల్లలుగానో, దొంగలుగానో మారుతున్నారు. ఇంకా మనం గ్రహించని కారణాల వల్ల కూడా "" అంటే అమ్మ, "" అంటే ఆవు అని పలకాల్సిన నోటితో "" అంటే అన్నం "" అంటే ఆకలి అని పలకాల్సివస్తుంది.
ఐతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మనమేమి చేద్దామంటే :-
1.మన చుట్టూ కనిపించే భిద కుటుంభాలకి చేతనైన సహాయం చేసి వాళ్ల పిల్లల్ని పనికి కాకుండా పాఠశాలకి పంపమని నచ్చజేప్పుదాం.
2.అనాధ పిల్లలకు అర్థరూపాయి ఇవ్వడంతో సరిపెట్టకుండా అనాధాశ్రమంలో చేర్పిద్దాం. అంతే కాకుండా మనకున్న దానిలో కొంత అనాదశ్రమాలకి విరాలమిద్దాం.
3.హోటళ్ళలో డబున్న వాళ్ల ఇళ్ళలో పని పిల్లలుగా పెట్టుకొని హింసించే వారిని బాల కార్మికుల చట్టం ప్రకారం శిక్షలు కలిగేలా చేసి ఆ పిల్లలను బడికి పోయేలా చేద్దాం.
నాకు తట్టిన ఆలోచనలు ఇవి. ఇంకా మీ మంచి మనసుతో ఆలోచించండి చాల పరిష్కార మార్గాలు దొరుకుతాయి.
శిర్షిక మీకు నచ్చిందని ఆశిస్తున్నాను
ఒకవేళ నచ్చితే దీనిపై మీ విలువైన అభిప్రాయాలూ, ఆలోచనలు కామెంట్ బాక్స్ లో వ్రాయండి

1 కామెంట్‌: