నా బ్లాగుని శోధించండి


Home హస్యాంజలి Free Software links My Orkut My FaceBook కూడలి
రాంగోపాల్ బ్లాగుకి స్వాగతం...

20, అక్టోబర్ 2009, మంగళవారం

పొగ'బారిన' హృదయాలు



"పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్ " ఈ వాక్యం వినగానే మనకు కన్యాశుల్కంలోని గిరీశం క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది.ఆనాడు గురజాడగారు అప్పటి సామాజికపరిస్తితులను కల్లకుకట్టినట్టుగా కన్యాశుల్కం నాటకంలో చూపించారు. ఆ నాటకం అప్పటి నుండి ఇప్పటివరకు ఎంతో పాపులర్. అలాగే పోగారయుల్లకి గిరీశం క్యారెక్టర్ కుడా అంతే పాపులర్, ఎంతగా అంటే తమను సమర్దించే వ్యక్తి తమవెంటే ఉన్నాడన్నంతగా కాని, ఒక్క విషయం సరదాగా పొగతో మేగాలు శ్రుష్టిస్తున్న పొగరాయుళ్ళు చివరికి పొగ వల్ల మేగాల్లో కలిసి పోయే రోజు వస్తుందని తెలిసి కూడా వారి సరదాని మార్చుకోవడానికి ఇష్టపడరు.

ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పలకుంటున్నాను ఒక కుక్కగారు తిరిగి తిరిగి అలసిపోయి ఒక ప్రదేశంలో ఇనపమొలున్నది చూడకుండ కూర్చున్నదట మొల తనకు గ్రుచ్చుకున్న అక్కడినుండి లేవకుండ అక్కడే కూర్చున్నదట ఈ విషయాన్నీ గంటసేపటినుండి గమనిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఇలా అంటున్నాడు ఒరేయ్ గంటసేపటినుండి ఆ కుక్క మొలపైన కూర్చొని అరుస్తుందిగాని అక్కడినుండి లేవడంలేదు ఎందుకని? దానికి రెండో వ్యక్తి ఇలా చెపుతున్నాడు ఆ కుక్కగారికి మొలవల్లవచ్చేనోప్పి సరిపోవడం లేదురా దానికి సరిపడే నొప్పి రాగానే అదే అక్కడినుండి లేచిపోతుందిలే అన్నాడట. అలాగే పొగరాయుళ్ళు కూడా చిన్నప్పుడు పోగాత్రగే వాల్లనుచుసి సరదాగా పొగత్రాగడం అలవాటు చేసుకుంటారు. మొదట్లో దగ్గు వచ్చిన, కళ్లు తిరిగిన తీయని భాధగా భరిస్తారు. అలవాటుగా మారినప్పుడు ఇతరులు దానివల్ల కలిగే చేడు చెప్పినా గాని వినిపించుకోరు. అలవాటు ముదురి ఉపిరితిత్తుల క్యాన్సుర్గా మారితే గాని వారికీ తెలియదు. కుక్క గారి నొప్పిలగా.
బస్సులో, సినిమాహలల్లో, రైల్వేస్టేషన్లలో ఇంకా, ఇతర ప్రాంతాలలో పొగత్రాగరాదు అనే స్లోగన్ చూసి అలవాటు లేని వారేమో ఇక్కడ పొగత్రాగడం నిషిద్దం అనుకుంటారు. కాని, అలవాటు ఉన్నవారు కాలిగా ఎందుకు ఉన్నావు పొగత్రాగరాదు అనుకుంటారేమో తెలియదు గాని ఎదేచ్చగా సిగరెట్టో, బీడియో జేబులోంచి తిసి అంటించి గుప్పు గుప్పుమని చిన్నపిల్లలు, ఆడవాళ్ళని కూడా చూడకుండా వారిపైకి పొగ ఉదుతారు. కాని వారికి తెలుసు పోగాత్రగే వారికన్నా దానిని పీల్చుకున్న వారిపైనే ఎక్కువ ప్రబావం చూపిస్తుంది. అయినా వారి సరదా వారిదే. ఎవరైనా వద్దని సలహా ఇస్తే చెప్పేవారికి వినేవాడు లోకువ అని సమర్దించుకుంటారు.
కాని
వారు కాల్చేది పొగాకు గొట్టం కాదు, వారి ఆయుషు అని గుర్తుంచుకోవాలి. పోయేది తమ ప్రాణమేననివెర్రిగా అనుకోకుండా వారిపైన ఆధారపడే బార్య బిడ్డలు అనాధలౌతారని గుర్తుంచుకోవాలి.

సిగరెట్టు
, బేడీలు వాటి తమ్ముళ్ళు (గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు) స్లో ఫాయిజన్ లాంటివి. మెల్లగా మెల్లగా వాటిని ఉపయోగించే వాళ్ళే గుర్తించకుండా వారి ఆరోగ్యాన్ని హరిస్తాయి. ఎ అలవాటు లేని వారు కూడా అన్ని చేడు అలవాట్లు ఉన్నా వారికన్నా ముందే పోవచ్చు. వాళ్ళను చూపించి మన చెడుఅలవాట్లను సమర్తించుకొని జీవితాన్ని అన్ని విధాల ఆస్వదిస్తమనుకుంటే మనం చదివే చదువులకు అర్థంలేనట్టే ఎందుకంటే పుట్టిన ప్రతివాడు పోయేవాడే అలాగని వున్నదంతా తినలేముగా ఎంతో కొంత రేపటి కోసం దాచుకుంటాం. అలాగే ఆరోగ్యాన్ని కూడా రేపటి కోసం కాపాడుకుంటే తప్పేముంది.
సినిమాల్లో క్లైమాక్సులో పోలిసుల్లా మన ప్రభుత్వం మొదట పొగాకు ఉత్పత్తి కంపెనిలకు అనుమతి ఇచ్చి, ఇప్పుడు పుర్రె, తెలు బొమ్మలతో ప్రజల్లో పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రచారం చేస్తుంది. ప్రజలపై అంత మమకారం ఉన్నా ప్రభుత్వం ఎందుకు మొదట పొగాకు ఉత్పత్తులకు అనుమతి ఇచ్చారు? ఇప్పుడు చేతులు కాలాక పుర్రెలు ఎందుకు పట్టుకోవాలి. ఏధి ఏమైన ఇప్పటికైనా కళ్లు తెరచిన పాలకులకు మన అభినందనలు తెలుపుదాం.

భీడి
కొందరి ఆయుషు తగ్గిస్తుంటే మరికొందరు బీదభీడి కార్మికుల ఆకలి తీర్చి అయిషుపెంచుతుంది వారికదే జీవనోపాధి. అందువల్ల పోగాకుపై మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నముందుగా బీద బీడీ కార్మికుల జీవనోపాధికి ఇతర మార్గాలు చూపిన తర్వాతే పుర్రె గుర్తుపై ప్రయోగాలు చేయాలనీ ఆశిద్దాం.

1 కామెంట్‌:

  1. ప్రశంసనీయ ప్రయత్నం. మీరు అన్నీ ఇలాంటి సాంఘిక సంక్షేమాన్ని కాంక్షించే టపాలే రాస్తున్నట్లున్నారు. అభినందనలు.

    పది పదిహేనేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు సిగరెట్లు కాల్చటం ఫ్యాషన్ అనుకునే యువతరం తగ్గినట్లే అనిపిస్తుంది. అయితే దాని స్థానంలో తాగుడు అలవాటు చేసుకుంటున్నవారి సంఖ్య మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయినట్లుంది.

    రిప్లయితొలగించండి